ప్రభుత్వం గుడ్ న్యూస్..వారికీ కూడా జీరో కరెంటు బిల్..!!
గత సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో భాగంగా గ్రామ జ్యోతి పథకం తీసుకువచ్చింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న కేవలం 500 కే గ్యాస్ సిలిండర్ దాంతో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. దీంతో ప్రతి ఇంటి కరెంట్ బిల్లు గత మార్చి నుంచి బిల్లులు జీరోగా వస్తున్నాయి. అంతేకాకుండా బిల్స్ జీరో రావడానికి మిషన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అందులో వచ్చిన దరఖాస్తు, అదేవిధంగా రేషన్ కార్డ్ ఆధారంగా అర్హతలు ఉన్న వారందరికీ బిల్స్ కొడితే ఒకేసారిగా జీరో బిల్స్ వచ్చే విధంగా మిషన్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఈ విధంగా రాష్ట్రంలోని ప్రజలకు జీరో బిల్స్ వస్తున్నాయి. అయితే ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ నెల నుంచి గ్రామం ప్రతి పథకం మొదలుకానుంది.
దేశంలోని లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే..ఇలాంటి స్థానాల్లో జీరో బిల్స్ రావాలని డిస్కం నిర్ణయించనున్నది. గ్రామ జ్యోతి పథకం అప్లికేషన్ ని పరిశీలించి 2023 మే 6 నుంచి అర్హులైన వారందరికీ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వబోతున్నారట. లోక్సభ ఎన్నికల కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఉండే సైబరాబాద్, రాజేంద్రనగర్ ఏరియాలో గ్రామ జ్యోతి పథకం అమలు కాలేదు.
రాష్ట్రంలోని గ్రామ జ్యోతి పథకానికి అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ బిల్లులో కరెంటు వినియోగానికి సంబంధించి రిపోర్ట్ గురించి పూర్తిగా వస్తూనే బిల్లుకు సంబంధించి మాత్రం జీరో గా వస్తుంది. కాగా జీజేయస్ సబ్సిడీ కింద బిల్ మొత్తం జీరో అయినట్టు చూపిస్తుంది. దీంతో వినియోగదారులు కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేకపోయింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 200 యూనిట్లలోపు కరెంటు వాడితేనే ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు. అట్ల కాదని 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడితే కచ్చితంగా కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ అభయ హస్త ఆరు గ్యారంటీలో ఎంతో కీలకమైనది ఉచిత కరెంటు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రారంభించిన కేవలం 500 కే సిలిండర్, ఉచిత కరెంట్ బిల్లు తెలంగాణ పేద ప్రజల్లో ఆనందం నింపారు సీఎం రేవంత్ రెడ్డి.