పేదలకు గుడ్ న్యూస్..కొత్త రేషన్ కార్డుపై మరో తీపి వార్త..!!

పేదలకు గుడ్ న్యూస్..కొత్త రేషన్ కార్డుపై మరో తీపి వార్త..!! 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. గెలిచిన తర్వాత..ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుల మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఆరు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే, గతంలో పాత రేషన్ కార్డులను తొలగించి కొత్త రూపంలో రేషన్ కార్డులను తయారు చేసేందుకు డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి ఈజీగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. కావున రేషన్ కార్డ్ విషయంలో కూడా చాలా వినుత్నంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ కార్డులను స్మార్ట్ కార్డ్ తరహా రాష్ట్ర ప్రజలకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే నేపథ్యంలో వాటి మీద టీజీ ప్రింట్ ఉండేటట్లు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా..కొత్తగా జారీ కాబోయే రేషన్ కార్డులపై సరికొత్తగా బార్కోడ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే, రేషన్ కార్డులపై బార్కోడ్ పెట్టడానికి ముఖ్య కారణం..రేషన్ సరుకు ఇతరులకు వెళ్లకుండా నేరుగా లబ్ధిదారుడికి చెందడానికి మాత్రమే. ఒకవేళ లబ్ధిదారుడు అనేక పనుల వల్ల ఆ నెల రోజుల్లో సరుకు తీసుకోకపోతే..మరుసటి నెలలో ఆ రెండు నెలల్లో ఉన్న సరుకును ఒకేసారి తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే సామాన్యుడు ఎంతో ఆనందిస్తాడు. అంతేకాకుండా ఈ రేషన్ సర్కుపై అంత టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు స్వరూపం పై అధికారులతో ఇప్పటికీ చర్యలు చేపట్టారట సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని లోక్సభ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్రంలోని ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేస్తోంది. అయితే, ఈసారి రానున్న రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారుడికి ఈజీ యాక్సెస్ తో పాటు లబ్ధి చేకూరేలా ఉంటుంది.

కాగా, అనేక కారణాలవల్ల రేషన్ కార్డులో కొందరి కుటుంబ సభ్యుల పేర్లు ఉండకపోవచ్చు. అయితే, ఇప్పుడు వారందరి పేర్లను కూడా రేషన్ కార్డులో పొందుపరిచేందుకు ప్రభుత్వం సన్హానాలు చేస్తోంది. ఈ మేరకు రానున్న కొత్త రేషన్ కార్డులో కుటుంబ సభ్యులందరికీ పేర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కొత్త స్వరూపంలో జారీ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందుతాయని తెలంగాణ పలు మంత్రులు అనేక సభల్లో హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం రేషన్ కార్డులకు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment