తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డులు..!!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డులు..!!

గత సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఇందులో ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కారణం..6 హామీలు ఇవ్వడం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన సంవత్సరం డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తులను ప్రారంభించి ఈ ఏడాది జనవరి 6 వరకు స్వీకరించింది. అయితే, ఈ ప్రజా పాలన దరఖాస్తులో ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలకు దరఖాస్తులను ఆహ్వానించారు.

కాగా, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ఈ ఆరు హామీలో యువ వికాసం మాత్రం దరఖాస్తుకు ఆహ్వానించలేదు. జరిగిన ఈ దరఖాస్తుల్లో రాష్ట్రంలో దాదాపు కోటి 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చినయి దరఖాస్తులను పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పల్లెకు స్లిప్ లను పంపిణీ చేశారు.

ఈ దరఖాస్తులతోపాటు రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డు లేని కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులను సమర్పించారు. అయితే, గ్యారెంటీలు కోసం అప్లై చేసుకున్న ప్రజల కన్నా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ప్రజలు రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు కావస్తోంది.

ప్రజా పాలన దరఖాస్తులో రేషన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ పెట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పాత రేషన్ కార్డులను తొలగించి కొత్త రూపంలో అందుబాటులో చేస్తారని ఇప్పటికే అందరికి తెలిసిన విషయం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కోడ్ టీఎస్ కు బదులుగా ఈజీగా మార్చింది. అయితే రేషన్ కార్డులో కూడా టీజీ ఉండేవిధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

త్వరలో వచ్చే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంతేకాకుండా కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులో సరికొత్తగా బార్కోడ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులో ఈ బార్కోడ్ పెట్టడానికి ముఖ్య కారణం..కేవలం లబ్ధిదారుడికి మాత్రమే సరుకు అందడం అంతేకాకుండా కొన్ని పనుల వల్ల లబ్ధిదారుడు నడుస్తున్న నెలల్లో సరుకు తీసుకోకపోతే..వచ్చే నెలలో ఆ సర్కులను తీసుకునే విధంగా చర్యలు చేపడుతోంది రేవంత్ రెడ్డి సర్కారు.

ఒకవేళ రేషన్ కార్డులు ఎలాంటి మార్పులు మాత్రమే జరుగుతే లబ్ధిదారుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం..ఒకవేళ రేషన్ సరుకులను మూడు నెలలు తీసుకోకపోతే కార్డును ఓల్డ్ లో పెట్టనున్నారు. అయితే, ఈ నెల 10వ తారీఖున పెండింగ్ రేషన్ గార్లను స్క్రూటీని చేసి జూన్ నెల కారణ లేదా జులై మొదటి వారంలో అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment