Pm scheme:ఈ కోర్స్ నేర్చుకుంటే.. ఉచితంగా నెలకు రూ. 8000..
ప్రధాన మంత్రి కౌశల్ వికాస పథకం. దీన్నే ఇంగ్లీష్‌లో పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అంటున్నారు. భారతీయ యువతకు ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. ఇది నిరుద్యోగ యువత, త్వరగా ఉద్యోగాలు పొందేలా చేస్తుంది. ఈ పథకం ద్వారా భారత్ లోని నిరుద్యోగ యువత, వివిధ రంగాల్లో శిక్షణ (ట్రైనింగ్) తీసుకోవచ్చు. దీంతో తమ స్కిల్ డెవలప్ చేసుకొని, కోరుకున్న ఉద్యోగం పొందొచ్చు. స్కిల్ డెవలప్ చేసుకోవడం వల్ల ఉద్యోగం ఎలా పొందొచ్చో తెలుసుకుందాం. అంతేకాకుండా నెలకు రూ.8,000 చొప్పున ఎలా పొందాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మీరు భారత పౌరుడు లేదా పౌరురాలు అయితే.. పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం నిరుద్యోగ యువత కోసమే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ (ట్రైనింగ్) ఇస్తున్నారు. దీంతో దేశంలో లక్షల మంది యువత, ఇంట్లోనే కూర్చొని ఉంటూ..ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం వారు స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేస్తారు. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసిన సమయంలో ప్రతి యువకుడికీ నెలకు రూ.8 వేలు చొప్పున అందజేస్తారు.
ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికీ కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చెయ్యవచ్చు. తద్వారా లబ్ధిదారుడు.. ఇతర నిరుద్యోగుల కంటే వేగంగా ఉద్యోగం పొందేందుకు వీలవుతుంది. కాగా, దేశమంతటా ఈ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది. తద్వారా యువత దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఈ పథకం కింద యువతకి టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడీ కార్డు, బ్యాగ్ మొదలైన వాటిని గుర్తింపు కొరకు ఇస్తారు. ఇందుకోసం నిరుద్యోగ యువత ఇంట్లోనే ఉంటూ ఆన్‌పైన్ ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ (https://www.pmkvyofficial.org/home-page) ఉంది.
దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. దేశంలోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారుడు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడి కనీస విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అంటే కొంతైనా అవగాహన ఉండాలి. తద్వారా కోర్సును త్వరగా, తేలికగా, సమర్థంగా చేసేందుకు వీలవుతుంది. ఈ పథకం పొందేందుకు ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు, విద్యార్హత పత్రాలు, అడ్రెస్స్ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ మొదలైనవి కలిగివుండాలి.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://www.pmkvyofficial.org/home-page)కి వెళ్లాలి. రిజిస్టర్ కొరకు హోమ్ పేజీలో PMKVY ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా ఈ విధంగా మీరు ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ పథకం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇక్కడ ( https://www.pmkvyofficial.org/pmkvy2/App_Documents/News/PMKVY_Scheme-Document_v1.1.pdf) PDF ఫార్మాట్‌లో మీరు పొందవచ్చు.