రైతులకు శుభవార్త..గ్రామ పంచాయతీకి వెళ్తే 2 లక్షలు ఇస్తారు…!!

రైతులకు శుభవార్త..గ్రామ పంచాయతీకి వెళ్తే 2 లక్షలు ఇస్తారు..!!

రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన ఓ పథకం MNREGA (మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం) అని చెప్పవచ్చు. ఈ పథకం కింద రూరల్ లో ఉండే రైతులకు ఆర్ధిక లబ్ది చేకూరేలా చూస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీం డీటెయిల్స్ చూద్దాం.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పశుసంవర్ధకానికి తోడ్పాటు అందించడం, తద్వారా వారు వారి జీవన, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మరియు సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తుంది.

అయితే, MNREGA పథకంలో భాగంగా పాడి రైతులు పశువుల షెడ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం 2 లక్షల వరకు సాయం అందించి, దానిపై సబ్సిడీ కూడా ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడంలో భాగంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు అండగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం ను అమలు చేస్తోంది.
.
మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం ద్వారా పశువుల షెడ్ నిర్మించుకోవడానికి కొన్ని ప్రధాన అర్హత ప్రమాణాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రమాణాలు స్థానిక ప్రభుత్వం, ప్రాంతీయ ప్రాతిపదికన రూపొందిచబడ్డాయి. ఈ పథకం పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే..మీ జిల్లాలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషణపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు, అవసరాన్ని బట్టి ఈ పథకం కింద జంతువుల కోసం షెడ్‌లను నిర్మించాలనుకునే వారికి మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం యానిమల్ షెడ్ పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ స్కీం ద్వారా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి మూలాన్ని సృష్టించవచ్చు.

ఈ పథకం కింద నిర్మించినటువంటి జంతువుల షెడ్లు..జంతువులకు చల్లదనం, భద్రత, అదేవిధంగా సాధారణ ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి. ఇది పశుసంవర్ధక సంరక్షణను మెరుగుపరుస్తుంది. అలాగే జంతు ఉత్పాదకతను పెంచుతుంది. పథకం కింద పశుపోషణను ప్రోత్సహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.

అయితే,మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం ద్వారా పశువుల కొట్టం కోసం దరఖాస్తు చేయడానికి నేరుగా మీరు మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్‌ నింపాలి. అందులో అడిగిన పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. అదేవిధంగా అవసరమైన పత్రాలను జత చేయాలి. ఆ తర్వాత మీ దరఖాస్తు ఫారమ్, పత్రాలు సంబంధిత అధికారిచే ధృవీకరించబడతాయి. అప్లికేషన్ ధృవీకరణ తర్వాత మీకు MNREGA పశువుల షెడ్ పథకం కింద ప్రయోజనాలు అందించబడతాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment