LIC Jeevan Anand Policy Scheme: కేవలం రూ.45 చెల్లిస్తే చాలు..రూ.25 లక్షలు పొందొచ్చు..!!

LIC Jeevan Anand Policy Scheme కేవలం రూ.45 చెల్లిస్తే చాలు..రూ.25 లక్షలు పొందొచ్చు..!!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సేవింగ్ స్కీమ్‌లు భద్రత అదేవిధంగా రాబడి రెండింటి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో పిల్లలు, వృద్ధులు, మహిళలకు వయస్సు ఆధారంగా పాలసీలు అందుబాటులో
ఉంటాయి. వీటిలో చాలా వరకు మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా భారీ ఫండ్‌ను కూడగట్టవచ్చు.

అదే పథకం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. దీనిలో మీరు రోజుకు కేవలం రూ. 45 ఆదా చేయడం ద్వారా రూ. 25 లక్షలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఎల్‌ఐసీ పథకంలో అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అవేంటో ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.

ఒకవేళ మీరు తక్కువ ప్రీమియంతో మీ కోసం పెద్ద ఫండ్‌ను సేకరించాలనుకుంటే..జీవన్ ఆనంద్ పాలసీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే..ఇది టర్మ్ పాలసీ లాంటిదే. మీ పాలసీ నడుస్తునంత కాలం మీరు ప్రీమియం చెల్లించకోవచ్చు. ఈ పథకంలో పాలసీదారుడు కేవలం ఒకటి మాత్రమే కాకుండా అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందొచ్చు. ఎల్‌ఐసీ ఈ పథకంలో కనీసం రూ.1 లక్ష హామీ అందిస్తుంది. అయితే, ఎక్కువ పరిమితి ఏదీ నిర్ణయించబడలేదు.

రూ.45 డిపాజిట్ చేయడం ద్వారా రూ.25 లక్షలు ఎలా పొందాలి?

ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ.1358 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ పూర్తి అయ్యేసరికి రూ.25 లక్షలు పొందవచ్చు. దాని ప్రకారం చూస్తే.. ప్రతిరోజూ రూ.45 మాత్రమే ఆదా చేయాల్సి ఉంటుంది. అయితే, ఎల్‌ఐసీ ఈ పాలసీ దీర్ఘకాలిక ప్రణాళికగా పరిగణిస్తారు. దీని పాలసీ వ్యవధి 15 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మీరు ప్రతిరోజూ రూ. 45 చెల్లిస్తే 35 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఈ పథకంలో మీకు రూ. 25 లక్షల మొత్తం లభిస్తుంది. అయితే, వార్షిక ప్రాతిపదికన కనుక మీరు పరిశీలిస్తే..అది దాదాపు రూ.16,300 అవుతుంది.

అయితే, 35 సంవత్సరాల పాటు ఈ ఎల్‌ఐసి పాలసీలో ప్రతి సంవత్సరం రూ. 16,300 పెట్టుబడి పెడితే..మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 5,70,500 అవుతుంది. ఇప్పుడు పాలసీ టర్మ్ ప్రకారం..ప్రాథమిక హామీ మొత్తం రూ. 5 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు రూ. 8.60 లక్షల రివిజనరీ బోనస్ రూ. 11.50 లక్షల చివరి బోనస్ అందుకుంటారు. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు ఇవ్వబడుతుంది. అయితే, దీనికి మీ పాలసీ తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.

ఈ పథకంలో ప్రయోజనాలు..

అయితే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే పాలసీదారు ఈ పథకం కింద ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మాత్రం పొందరు. కానీ ఇందులో మీరు నాలుగు రకాల రైడర్‌లను పొందుతారు. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ ఉన్నాయి. ఇక డెత్ బెనిఫిట్ గురించి మాట్లాడితే…పాలసీదారుడు ఏదైనా కారణం వల్ల మరణిస్తే..నామినీ పాలసీలో 125 శాతం డెత్ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment