రేషన్ కార్డు పై మీ పేరు లేదా?..తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..!!

రేషన్ కార్డు పై మీ పేరు లేదా?..తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..!!

గత కొన్ని రోజులుగా దేశమంతటా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని, అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు అందుతుందని ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు అనేక సభల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే పనిలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎలక్షన్ కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి.. క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారట. దీనికి ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడంతో అనేక కుటుంబాలు వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి మనందరికీ తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అప్లికేషన్స్ తీసుకుంది. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎలక్షన్ కోడ్ ముగియగానే..కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సారి రేషన్ కార్డుల జారీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందట రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని పేదల ఇంట్లో ఉండే రేషన్ కార్డులపై తమదైన మార్క్ ఉండాలనే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రంలోని ఉన్న పాత రేషన్ కార్డుల రూపు రేఖలను పూర్తిగా మార్చేయడమే గాక కొత్తగా ఇష్యూ చేయబోతున్న రేషన్ కార్డులపై కాంగ్రెస్ మార్క్ ఉండేలా శ్రద్ద తీసుకొంటోంది. అయితే, ఇదే సమయంలో ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే? రేషన్ కార్డు ఉన్నపటికీ..అందులో కుటుంబ సభ్యుల అందరి పేర్లు లేనివారు ఎక్కువ మందే ఉన్నారు. కాగా, ఇప్పుడు వారందరికీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వబోతోందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులపై కుటుంబంలోని అందరి పేర్లు వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment