సామాన్యుడి బడ్జెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..ధర ఎంతంటే..?
మీరు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే..GT ఫోర్స్ తన కొత్త శ్రేణి హై, తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కొత్త స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.55,555 నుండి రూ.84,555 వరకు ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ నాలుగు కొత్త స్కూటర్లను పరిచయం చేసింది. ఇందులో GT వేగాస్, GT Ryd Plus, GT Oneplus ప్రో, GT డ్రైవ్ ప్రో మోడల్స్ ఉన్నాయి. కళాశాల విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారు, ఫ్రీలాన్స్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త స్కూటర్లను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్కూటర్లు బలమైన పనితీరును ఇస్తాయని, పర్యావరణాన్ని మెరుగ్గా ఉంచడంలో కూడా సహాయపడతాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
GT వెగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు
కొత్త GT వేగాస్ తక్కువ వేగంతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.55,555 గా ఉంది. ఈ స్కూటర్‌లో BLDC మోటార్, 1.5 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4-5 గంటల్లో సులభంగా ఛార్జ్ చేయబడుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..ఈ స్కూటర్ 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని వేగం గంటకు 25 కిమీ ఇస్తుంది. దీని లోడ్ కెపాసిటీ 150 కిలోలు. సీటు ఎత్తు 760 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ. బరువు 88 కిలోలు గా ఉంది.
GT Ryd Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు
జిటి రైడ్ ప్లస్ కూడా తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.65,555 గా ఉంది. ఇది 2.2 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..95 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. దీని గరిష్ట వేగం 25 kmph. లోడ్ కెపాసిటీ 160 kg. GT రైడ్ ప్లస్ యొక్క సీటు ఎత్తు 680 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm. బరువు 90 కిలోలు.
జిటి వన్ ప్లస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు
ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. దీని లోడ్ కెపాసిటీ 180 కిలోలు. ఈ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..110 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ. బరువు 80 కిలోలు.
GT డ్రైవ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు
ఇది కంపెనీ యొక్క అత్యధిక వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది శక్తివంతమైన BLDC మోటార్, 2.5 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. దీని లోడ్ కెపాసిటీ 180 కిలోలు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200mm. బరువు 85 కిలోలు. ఈ స్కూటర్ ఎక్స్-షో రూమ్ ధర రూ.84,555 గా ఉంది.