Students Scholarship : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు వెంటనే అప్లై చేసుకోండి
విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే అనేక పథకాలు ఉన్నాయి. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలనుకునే వారు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ( NSP )లో దరఖాస్తు చేసుకోవాలి. కొద్ది రోజుల క్రితం, NSP 2024 స్కాలర్‌షిప్ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
College , University విద్యార్థులు National Merit Scholarship కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్టోబర్ 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో దరఖాస్తు చేసుకున్న వారు 2024-25 విద్యా సంవత్సరానికి మరోసారి Renewal చేసుకోవాలి. నవంబర్ 15లోగా Nodel అధికారులు వెరిఫికేషన్ నిర్వహిస్తారని ఇంటర్ బోర్డు వెల్లడించింది. దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులు https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఆప్షన్‌కి వెళ్లండి. ఇక్కడ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ఎంపికపై క్లిక్ చేసి, విద్యార్థుల వివరాలను నమోదు చేయండి. విద్యార్థులు మొబైల్ నంబర్‌కు పంపిన OTP మరియు పాస్‌వర్డ్ సహాయంతో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న వివరాలను పూర్తిగా నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి. ఎన్‌ఎస్‌పీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు.. బ్యాంక్ పాస్ బుక్, వాడుకలో ఉన్న మొబైల్ నంబర్, అడ్రస్ ప్రూఫ్, మార్కుల మెమోరాండం మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. విద్యార్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. విద్యార్థి గత సంవత్సరం చదివిన మార్కులలో 50 శాతం ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.