నెగెటివ్ బ్యాలెన్స్‌పై కొత్త నిబంధనను జారీ చేసిన ఆర్‌బీఐ..!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI కొత్త నిబంధనను జారీ చేసింది. దీని ప్రకారం..మీ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్‌లోకి వెళితే..దానిపై బ్యాంకు వడ్డీని వసూలు చేయదు. అంటే, మైనస్‌లో బ్యాలెన్స్ ఉన్న మీ బ్యాంక్ ఖాతాలలో దేనినైనా మీరు మూసివేయాలనుకుంటే.. మీరు దీని కోసం ప్రత్యేకంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే..బ్యాలెన్స్ నెగిటివ్‌గా ఉన్నా బ్యాంకులు వడ్డీని వసూలు చేయలేవని ఆర్‌బీఐ కొత్త నిబంధనను జారీ చేసింది. బ్యాంకు సంబంధిత పనులను పూర్తి చేసేందుకు గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, టెక్నాలజీ పెరిగేకొద్దీ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినప్పటి నుండి అదేవిధంగా బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌లోకి మారినప్పటి నుండి, దాదాపు అన్ని బ్యాంకులకు సంబంధించిన పని ఫోన్‌లో జరుగుతుంది. అంతే కాకుండా బ్యాంక్ పనిని ఎంతో సులభంగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.
ఈ నేపథ్యంలో టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ వచ్చే సరికి బ్యాంక్ సమస్యలను కూడా సృష్టించగలదు. చాలా మంది ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉంచడం ప్రారంభించారు. దీంతో మినిమమ్ బ్యాలెన్స్‌ను నిర్వహించడం కష్టతరం అయిపోయింది. చాలా సందర్భాలలో బ్యాలెన్స్ మైనస్‌కి కూడా వెళుతుంది.
అటువంటి పరిస్థితిలో మీరు ఖాతాను మూసివేయమని బ్యాంకును అడిగితే..మైనస్‌లో ఉన్న మొత్తాన్ని చెల్లించమని మిమ్మల్ని అడుగుతారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఖాతాదారులకు ఉపశమనం కలిగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కృషి చేసింది. RBI యొక్క కొత్త నిబంధనల ప్రకారం..మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే..అది జీరో కావచ్చు. కానీ దానిపై వడ్డీని వసూలు చేయడం ద్వారా బ్యాంకులు దానిని మైనస్‌గా మార్చలేవు.
ఛార్జీలు చెల్లించకుండా ఖాతాను మూసివేయవచ్చు మీ ఖాతాలోని బ్యాలెన్స్ మైనస్‌లో కనిపిస్తున్నప్పటికీ..ఈ మొత్తాన్ని చెల్లించమని బ్యాంకులు కస్టమర్‌ని అడగలేవు. దీంతో ప్రతికూలంగా మారిన బ్యాలెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేసే హక్కు బ్యాంకుకు లేదు. RBI మార్గదర్శకాల ప్రకారం..మీ వద్ద మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ బ్యాంక్ ఖాతాను మూసివేయవచ్చు. దీని కోసం బ్యాంకులు డబ్బు తీసుకోలేవు.