పోస్ట్ ఆఫీస్ పథకం..రూ.4,000తో రూ. 2లక్షలు పొందండిలా..!!
ఈ కాలంలో ఎవరైనా సరే తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడిని సంపాదించాలనుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించాలనుకునేది ఇప్పుడు టార్గెట్ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో పోస్ట్ ఆఫీస్ పథకాలు మనకు అనేక విధాలుగా సహాయపడుతాయి. ఈమధ్య కాలంలో ప్రజలందరూ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.దీనికి ముఖ్య కారణం కేంద్రం ఈ పథకాలకు అండగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టొచ్చు.
అయితే, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు జమ చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత స్థిరమైన రిటర్నింగ్ వస్తుంది. అందుకే దేశంలోని ఎక్కువ ప్రజలు ఈ పథకంలో లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దీంతో రిస్క్ లేకుండా వారు అధికంగా డబ్బులు సంపాదిస్తారు.
ఈ రికరింగ్ డిపాజిట్ లో ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి దాదాపు 5 సంవత్సరాలు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. తద్వారా మంచి రాబడిని పొందుతారు. ఇక ఈ రిక్కరింగ్ డిపాజిట్ వడ్డీ విషయం గురించి చూస్తే సంవత్సరానికి దాదాపు 6.7% ఉంటుంది.
అయితే, ఇదివరకు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు సంవత్సరానికి 6.5% ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి డిపాజిట్లను ప్రోత్సహించేందుకు వడ్డీ రేటును దాదాపు 20 బేసిక్ పాయింట్లు పెంచింది. కాగా 2023 సంవత్సరం నుంచి ఈ వడ్డీ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకోసారి నిర్ణయిస్తారు.
ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో మీరు నెలవారీగా రూ.4000 పెట్టుబడి పెడితే అలా అయిదు సంవత్సరాలు తర్వాత ఎంత వస్తుంది అని చూస్తే..మీరు 5 సంవత్సరాల్లో దాదాపు రూ.240000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తద్వారా 5 సంవత్సరాల్లో మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ కి ఏకంగా సంవత్సరానికి రూ.45,460 వడ్డీ రేట్లను పొందుతారు. దీంతో ఐదు సంవత్సరాల మీ పీరియడ్ ముగిసే వరకు రూ. 2,85,463 రిటర్న్ పొందుతారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ప్రతి నెలకు వడ్డీ రేటు రూ .10000 ఎక్కువ వడ్డీ వస్తే.. దానిపై 10 శాతం టిడిపి వసూలు చేస్తారు.