రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేస్తే..చేతికి 35 లక్షలు..ప్రతి రూ. 1000 కి రూ.60 బోనస్..!!
ఇవాళ పొదుపు చేస్తేనే.. రేపు నిశ్చింతగా ఉండొచ్చు. పెద్దలూ ఇదే చెబుతుంటారు. పెద్దయ్యాక.. అంటే వృద్ధాప్యంలో ఎలాంటి చింత లేకుండా ఉండాలంటే.. చిన్న వయసు నుంచే పొదుపు అలవర్చుకోవాలి. దీని కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు చేసేందుకు మనకు ఎన్నో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు లేకుండా కూడా ఈ స్కీం పనిచేస్తుంది. ఇది కేవలం పొదుపు పథకమే మాత్రమే కాకుండా.. హెల్త్ అండ్ లైఫ్ అష్యురెన్స్ పాలసీ కావడం విశేషం. 1995 లో ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను పోస్టాఫీస్ ప్రారంభించింది. పోస్టాఫీసులు అంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి.
కేంద్ర ప్రభుత్వం భరోసా ఉండటం సహా చిన్న మొత్తాల్లో కూడా వీటిల్లో పొదుపు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అందుకే వీటిల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి సేవింగ్స్ స్కీమ్స్‌ను కేంద్రం అందిస్తుండగా.. నేరుగా పోస్టాఫీసులే కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ముఖ్యంగా వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ అందించే ఒక స్కీమ్ పేరు గ్రామ సురక్ష యోజన. ఈ స్కీంలో 19 నుంచి 55 మధ్య వయసున్న భారతీయులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది వార్షిక ప్రాతిపదికన కనీసం రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఉండొచ్చు.
80 ఏళ్ల వయసు దాటాక బోనస్‌తో కలిసి పూర్తి డబ్బులు అందుతాయి. 80 ఏళ్ల వయసు కంటే ముందుగానే సదరు పాలసీ హోల్డర్ మరణిస్తే..నామినీకి పెద్ద మొత్తంలో నగదు చేకూరుతుంది. మీరు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. మూడేళ్ల తర్వాత ఈ స్కీం ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఐదేళ్ల తర్వాత..బోనస్ తీసుకోవచ్చు. ఐదేళ్ల కంటే ముందే ఈ స్కీం సరెండర్ చేస్తే..పక్క బోనస్ కోల్పోతారు.
ఈ పథకంలో ప్రీమియం చెల్లించేందుకు మెచ్యూరిటీ 55 సంవత్సరాలు, 58 ఏళ్లు, 60 ఏళ్లు ఇలా వరుసగా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం ఎంచుకోవాలి. ఉదాహరణకు ఒకవేళ మీరు రూ. 10 లక్షల ప్రీమియం లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే..19 ఏళ్ల వయసులో ఈ స్కీంలో భాగ్యం అయితే.. 55 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు మీకు రూ. 1515 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 50 సరిపోతుంది. 58 ఏళ్ల వరకు ఈ స్కీంలో నమోదు చేసుకుంటే అప్పుడు రూ. 1463 ప్రీమియం, 60 ఏళ్లకు అయితే రూ. 1411 ప్రీమియం కట్టాలి.
55 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీకి చేతికి రూ. 31.60 లక్షలు, 58 ఏళ్ల ప్రీమియం అయితే రూ. 33.40 లక్షలు, 60 ఏళ్ల ప్రీమియం అయితే రూ. 34.60 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. ఈ స్కీంలో ఇంకా గొప్ప బెనిఫిట్ ఏంటంటే.. బోనస్. మీరు డిపాజిట్ చేసే ప్రతి రూ. 1000కి ఏడాదికి రూ. 60 బోనస్‌గా వస్తుంది. అంటే బోనస్ ద్వారానే ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నమాట. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఈ పథకం ద్వారా అందుకోవచ్చు.