తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్ కట్..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్ కట్..!!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో లోక్సభ ఎన్నికలు ఇటీవల పూర్తయినవి. దీంతో ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంపై దృష్టి పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అర్హతలు ఉండే లబ్ధిదారులకు చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప స్కీం గృహజ్యోతి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 27 న 500 కి గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా మార్చి మొదటి వారం నుంచి కరెంటు బిల్లులన్నీ జీరోగా వస్తున్నాయి. ఉచిత కరెంటు పొందే అర్హతలు ఉన్నవారికి బిల్డింగ్ మిషన్లో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి జీరో బిల్స్ జారీ చేస్తున్నారు.

అయితే, ప్రజా పాలన దరఖాస్తు, వచ్చిన రేషన్ కార్డ్ ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మిషన్ లో ఆటోమేటిక్గా జీరో బిల్స్ వచ్చేలాగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు ఉచిత కరెంటు పొందుతున్నారు.

అయితే, గృహజ్యోతి పథకంపై ఎఫెక్ట్ పడింది. ఈ ఉచిత కరెంట్ అర్హత పొందిన వారికి స్కీం కట్ అయిపోయింది. దీనికి ముఖ్య కారణం.. పథకం విధివిధానాల ప్రకారం 200 యూనిట్ల లోపే కరెంటు వాడాలి. అప్పుడే ఉచిత కరెంట్ వాడొచ్చు. ఒకవేళ 200 యూనిట్ల కన్నా ఎక్కువగా కరెంటు వాడితే బిల్లు కట్టాల్సిందే.

ఈ నేపథ్యంలో మార్చి నెలలో జీరో బి తీసుకున్న కుటుంబాలు ఏప్రిల్ మే జీరో బిల్ తీసుకోలేకపోయినవి. ఇందుకు కారణం..కరెంట్ అధికంగా ఉపయోగించడం. సమ్మర్ కావడంతో వేడికి తట్టుకోలేక కరెంటు వినియోగం కాస్త పెరిగింది. దీంతో 200 యూనిట్ల కరెంటు మించి వచ్చింది. అయితే, వారు రెండు నెలలు పూర్తి కరెంట్ బిల్ కట్టాల్సి వచ్చింది.

గతంలో 200 యూనిట్లు ఉచితంగా కరెంటు రావడం వల్ల జీరో బిల్స్ తీసుకున్న కుటుంబాలు ఒకేసారిగా కరెంట్ బిల్స్ చూసి కంగారు పడ్డారు. అయితే, స్కీం ప్రకారం..విద్యుత్ వినియోగం కేవలం 200 యూనిట్లు మాత్రమే ఉంటుంది. అర్హులై ఉన్నవారికి 200 యూనిట్లలోపు విద్యుత్ వాడితేనే జీరో బిల్ వస్తుందని అధికారులు తెలిపారు.

కావున రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే..ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తున్న అని ఇష్టానుసారం వాడడం మంచిది కాదు. ఒకవేళ మీటర్ గనుక 200 యూనిట్లు దాటితే..ఆ నెలకు మీకు ఉచిత పథకం వర్తించదు. వచ్చిన కరెంటు బిల్లుకు కట్టాల్సిందే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now