పోస్టాఫీస్ లో అదిరే స్కీమ్..రోజుకు రూ.50 పొదుపు చేస్తే..చేతికి రూ.30లక్షలు..!

పోస్టాఫీస్ లో అదిరే స్కీమ్..రోజుకు రూ.50 పొదుపు చేస్తే..చేతికి రూ.30లక్షలు..!

సాధారణంగా ఎవరైనా సరే ముందు చూపు కోసం మంచి లాభాలు అందించే పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అదే టైమ్లో రెగ్యులర్ ఆదాయంతో తక్కువ రిస్క్ ఉండే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పోస్టాఫీస్(Post Office) అందించే పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో భాగంగా ఉండే ఓ పథకమే.. “గ్రామ సురక్ష యోజన(Gram Suraksha Yojana)”. దీంట్లో రోజూ రూ.50 పెట్టుబడి పెడితే చాలు..మెచ్యూరిటీ నాటికి రూ.30లక్షలు అందుకోవచ్చు. ఇంతకీ ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు? మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? ఎలా చేరాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గ్రామ సురక్ష యోజన పథకానికి అర్హతలు

ఇండియన్ పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన గ్రామ సురక్ష యోజన పథకం కేవలం పొదుపు పథకమే మాత్రమే కాకుండా..హెల్త్ అండ్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ అని కూడా చెప్పవచ్చు.ఈ పథకాన్ని 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. భారత దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తపాలా శాఖ మొదలుపెట్టింది. ఈ స్కీం లో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయులెవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్కు సంబంధించిన ప్రీమియం చెల్లించడానికి వివిధ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలవారీగా..మూడు నెలల ప్రాతిపదికన అంటే 6 నెలలకు ఓసారి..సంవత్సరానికి ఒకసారి ఇలా ఎప్పుడైనా ప్రీమియం డబ్బుల్ని చెల్లించవచ్చు.

గ్రామ సురక్ష యోజన పథకంప్రీమియం చెల్లింపు వివరాలు

గ్రామ సురక్ష యోజన పథకం మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు..ఈ విధంగా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల ఉన్నప్పుడు రూ.10 లక్షల ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే.. అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాలి. అంటే రోజకు 50 రూపాయలన్నమాట అని అర్థం ఐతుంది. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఎలా వస్తుందంటే?

గ్రామ సురక్ష యోజన పథకంలో మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి చేశారనే దాన్ని బట్టి.. మీకు వచ్చే లాభం ఉంటుంది. మీరు ఒకవేళ 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే..మీకు రూ.31.60 లక్షలు లాభంగా వస్తాయి. అదే.. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే..33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. ఈ మెచ్యూరిటీ సొమ్ము 80 ఏళ్లు నిండిన తర్వాత అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు అంటే పథకంలో కివీస్ చేసిన వ్యక్తి మధ్యలో మరణిస్తే..మీ స్కీమ్ అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా మీ నామినీకి చెల్లిస్తారు పోస్ట్ ఆఫీస్ అధికారులు. ఈ పథకాన్ని ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత..పాలసీదారుడు తమ ఇష్టంతో దీన్ని నిలిపేయవచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్లో బోనస్‌ కూడా ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.

గ్రామ సురక్ష యోజన పథకం ఎలా చేరాలంటే?

మీ దగ్గర్లో పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఈ స్కీమ్ గురించి పూర్తివివరాలు అడిగి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత.. పథకానికి సంబంధిత అప్లికేషన్‌ ఫారమ్‌ నింపి..అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి పోస్ట్ ఆఫీస్ అధికారులకు ఇవ్వాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment