తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..గోల్డ్ లోన్స్‌ పై కూడా రుణమాఫీ..!!

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..గోల్డ్ లోన్స్‌ పై కూడా రుణమాఫీ..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో గెలిచినా తర్వాత రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికలో ఇచ్చిన హామీలను వరుసపెట్టి అమలులోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన
చేస్తోంది. కాగా, రైతు రుణమాఫీపై సర్కార్ ప్రత్యేక శ్రద్ద పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే తెలంగాణ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఎన్నికలో సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు తెలిపారు. ఈ తరుణంలో రైతుల రుణమాఫీ కోసం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్.

ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లోక్ సభ ఎన్నిలకల ప్రచారంలో చెప్పారు. ఈ క్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. రూ.2 లక్షల రుణ మాఫీ పథకానికి డిసెంబరు 9నే కటాఫ్‌ తేదీగా ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. అదే రోజే సోనియాగాంధీ పుట్టిన రోజు కావడంతో డిసెంబరు 9నే కటాఫ్‌ తేదీగా నిర్ణయిచుకున్నట్లు తెలుస్తోంది. అంటే..ఆ తేదీ లోపు రైతులు పంటలకు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే.. అంత డబ్బు మొత్తం మాఫీ చేస్తారు.

ఒకవేళ రైతులకు రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంటే..అందులోంచి రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి ప్రభుత్వం చెబుతోంది. రైతు ఒకటి కంటే..అనేక బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే..అన్నీ కలిపి లెక్కిస్తారు. ఒక్క కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తింపజేస్తారు. అంటే..ఒక్క కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ కానుందన్నమాట మరి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తించుకోవాల్సింది ఏంటంటే..పంటలకు రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లపై కూడా రుణమాఫీ అప్లై చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాలప్రస్తావన కూడా ఉండటం విశేషం.

ఇప్పటికే రూ.2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది.ఈ ఏడాది జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాగానే..రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసి..రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ.. అన్నదాతల మంచి కొరకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ సర్కార్ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment