తెలంగాణ ప్రజలకు శుభవార్త..వారి అకౌంట్లలోకి లక్ష రూపాయలు..!!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అదిరే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు విడుదల చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసింది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
ఇటీవల తెలంగాణ సర్కార్ కల్యాణ లక్ష్మి పథకాని కోసం నిధులు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అర్హత కలిగిన వారికి ఆర్థిక సాయం లభిస్తుంది.
లోక్ సభ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మి అదేవిధంగా తులం బంగారం స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా..కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ పేరిట గతంలో అందజేసిన ఆర్థిక సాయం తో పాటు తులం బంగారం కూడా అర్హలుకు అందజేస్తాం అని ప్రకటించింది.
ఈ అంశంపై చాల సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం.. ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీని వల్ల లబ్ధిదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుతో పాటుగా బంగారం కూడా లభించనుంది. అందువల్ల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఉచిత బస్ ప్రయాణం స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. ఇంకా రూ. 500కే గ్యాస్ సిలిండ్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా లాంచ్ చేసింది.
అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఫ్రీ కరెంట్ పథకం కూడా అమలులో ఉంది. 200 యూనిట్ల వరకు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. కాగా, ఇప్పుడు కల్యాణ లక్ష్మీ స్కీమ్ కింద తులం బంగారం అదేవిధంగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కూడా అందజేయడానికి నిధులు మంజూరు చేసింది.
అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ కింద లబ్ధి దారులకు ఊరట కలిగేలా రూ.700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అర్హత కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. డబ్బులు అందనున్నాయి. అయితే, ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని ప్రతి పక్షాలు చాలా రోజులుగా విమర్శిస్తున్నాయి.
పథకాలకు అర్హత ఉన్న వారికి కూడా పథకాల ప్రయోజనాలు మొత్తం స్థాయిలో అందడం లేదని పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో పథకం ప్రయోజనాలు పొందని వారు, అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అందరికి తెలియజేస్తోంది.