తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్లకు కొత్త దరఖాస్తులు..!!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్లకు కొత్త దరఖాస్తులు..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతోందాని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. పథకం ఆరంభం లోనే ఇంటి నమూనా తాయారు చేసి ప్రజలకు చూపించిన సీఎం.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు అర్హత ఏంటి? ఎవరెవరికి మంజూరు చేస్తారనేది పేర్కొంటూ గైడ్‌లైన్స్ కూడా మొదట్లో రిలీజ్ చేశారు. అయితే ఈ పథకంలో ఇందిరమ్మ ఇల్లు కేవలం మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. కాగా, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో తొలి దశలో భాగంగా..సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేనివారికి ఆర్ధిక సాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్ లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలపై క్రమంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బసుతో పాటు..ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు అండగా నిలిచి తీరుతాం అని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచాతప్పకుండా నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. మరిన్ని పథకాలు అమలు చేయడానికి గత కొన్ని నెల్లుగా ప్రతి గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం పేరుతో కార్యక్రమం నిర్వహించి గ్రామా ప్రజల నుంచి దరఖాస్తులు, వివరాలు సేకరించారు. తమ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ముందుకెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి..మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశం ఇవ్వనుందట. వచ్చే రోజుల్లో మరోసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని నివేదికలు సమాచారం ఇస్తున్నాయి.

క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోబోతున్నారట. తొలి విడతగా ఈ పథకానికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు మంజూరు చేస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారట.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment