పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..అక్షయ తృతీయ పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనేవారికి స్వల్ప ఊరట లభించింది. అక్షయ తృతీయ పండుగ వేళ ఈరోజు బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ధరల హెచ్చుతగ్గుల మధ్య దోబూచులాడుతోంది బంగారం ధర. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, పలుదేశాల యుద్ద ప్రభావాలు, వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు కలిపి బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలకు కారణం అవుతోంది. ఈరోజు హైదరాబాద్లో స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 గా ఉంది. అదే 22 క్యారెట్ల పసిడి రేటు తులం రూ. 66,240కు చేరింది. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే..తులంపై రూ. 10 తగ్గుదల కనిపిస్తోంది. అలాగే తులం వెండి ధర రూ. 88,400కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ. 100 తగ్గింది. ఈ వారంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు నెలకొన్న బంగారం, వెండి ధరల వివరాలు తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర..
24 క్యారెట్ల రేటు ఇలా..
24 క్యారెట్ల ప్యూర్ స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే..విజయవాడ నగరంలో తులం బంగారం ధర రూ. 72,260 గా ఉంది. కాగా బెంగళూరు, ముంబై మహానగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 72,320కు చేరింది.
22 క్యారెట్ల రేటు ఇలా..
22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే..విజయవాడలో తులం బంగారం ధర రూ. 66,240 గా ఉంది. కాగా బెంగళూరు, ముంబై మహానగరాల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. అయితే, చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 66,290కు చేరింది.
కిలో వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ – రూ. 88,400 గా ఉంది.
విజయవాడ – రూ. 88,400 గా ఉంది.
ముంబై – రూ. 88,400 గా ఉంది.
చెన్నై – రూ. 88,400 గా ఉంది.
బెంగళూరు – రూ. 84,200 గా ఉంది.