ఏపీ లోనూ ఉచిత కరెంటు..ఎవరికంటే..?ఏపీ లోనూ ఉచిత కరెంటు..ఎవరికంటే..?
గత సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విధంగా విజయం సాధించింది. ఇందుకు ముఖ్య కారణం..ఎన్నికల సమయంలో ఆరోగ్యారెంటీల హామీలు అనే చెప్పాలి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా ఇచ్చిన హామీల మీద ఫోకస్ పెట్టింది. ఈ 6 గ్యారంటీలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది..ఫ్రీ బస్ అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు. కాగా, ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఈ హామీలను పొందుతున్నారు. అయితే, అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఇస్తామని టిడిపి-బిజెపి-జనసేన కూటమి తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
ఈ నేపథ్యంలో కూటమి అనేక హామీల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ మెజారిటీతో ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. అయితే, వైఎస్ఆర్సిపి మాత్రం తక్కువ సీట్లకు పరిమితం అయినా విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తర్వాత..ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్లాన్ చేస్తోంది.అందులో భాగంగా మొదటగా రాష్ట్ర ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణము, దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రజలకు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అమలు అవుతున్న ఉచిత కరెంటు విధంగానే ఆంధ్రప్రదేశ్ లోను కూడా ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ అందిస్తారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు వివరాలు స్వీకరించి, త్వరలోనే అర్హులైన వారికి ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంటు ప్రతి ఒక్కరికి కాకుండా కేవలం డోబిలకు మాత్రమే కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కాకుండా ఉచిత కరెంటు డోభి షూట్లకు మాత్రమే ఇవ్వనున్నారు
ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కల్పించనున్నారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను త్వరలో స్వీకరించి ఉచిత కరెంట్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా.. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున సంవత్సరానికి రూ.18000 అందజేత లాంటి పథకాలు రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్నారు.