మీకు ప్రతినెలా రూ. 3000 కావాలా?..ఇలా చేయండి..
ఈ పథకం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని ఇంగ్లీషులో నేషనల్ పెన్షన్స్ స్కీం ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అని అంటారు. ఈ పథకం దేశంలోని చిరు వ్యాపారులకు,రిటైలర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం లబ్ధిదారుడికి లబ్ధిదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత దాదాపు నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే..లబ్ధిదారుడి జీవిత భాగస్వామి కి దాదాపు 50 శాతం అనగా రూ.1500 వస్తాయి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..సగం పెన్షన్ మరణించిన భాగ్య స్వాములకు మాత్రమే అందజేస్తారు. అయితే, ఈ పథకానికి చిన్నపాటి దుకాణ యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్ యజమానులు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చిన్న హోటల్లు రెస్టారెంట్ యజమానులు, వార్షిక టర్నోవర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు తదితరులు అర్హులు.
ఈ పథకం పొందేందుకు అర్హతలు
లబ్ధిదారుడు చిన్నాపాటి దుకాణ యజమాని కానీ రిటైల్ వ్యాపారులు కానీ, కమిషన్ ఏజెంట్లు గానీ ఎవరైనా సరే దాదాపు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యాపారుల యొక్క ఆదాయంరూ రూ.1,50,00,000 లక్షలు మించకూడదు. అలాగే దరఖాస్తుదారుడు ఈపీఎఫ్ఓ, ఎన్పీఎస్, ఈఎస్ఐసి ద్వారా కాంట్రిబ్యూషన్ చేసే..ఎలాంటి నేషనల్ పెన్షన్స్ స్కీమ్ ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారుడు ఎలాంటి ఆదాయపు చెల్లింపులు చేయకూడదు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల దరఖాస్తుదారుడు 60 ఏళ్లు వచ్చే వరకు రూ .55 నుంచి రూ. 200 దాకా కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అతను 48 వేల వరకు చెల్లించాలి. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన తర్వాత తన మొత్తం పెన్షన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు
ఈ పథకానికి కావాల్సిన పత్రాలు
ఈ నేషనల్ పెన్షన్ స్కీం ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ లేదా జన్ ధన్ ఖాతా వివరాలు, ఐఎఫ్సి కోడ్ వంటివి కావాలి.
ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్నవారు దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పథకానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైన్యూర్ నగదు రూపంలో ప్రారంభ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని అందజేస్తారు. ఈ పథకానికి ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు పై ముద్రించిన ఆధార్ నంబర్, లబ్ధిదారుని పేరు, పుట్టిన తేదీ కీలకం అవుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నెంబర్ ఇమెయిల్ చిరునామా జిఎస్టిఐఎన్ సంవత్సర టర్నోవర్ ఆదాయం జీవిత భాగస్వామి వివరాలు వంటి వివరాలు నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే, ఆధారం కొరకు సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా చేస్తారు. లబ్ధిదారుల వయసు బట్టి చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ సిస్టం ఆటోమేటిగ్గా లెక్కిస్తుంది. లబ్ధిదారుడు మొదటి సబ్స్రిప్షన్ మొత్తాన్ని విఎల్ఈకి నగదుగా చెల్లించాలి. దీంతో ఎన్రోల్మెంట్ ఆటో డిబేట్ మాండెట్ ఫారం ప్రింట్ అవుతుంది. అయితే, లబ్ధిదారుడు ఈ పత్రం పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని విఎల్ స్కాన్ చేసి సిస్టంలో అప్లోడ్ చేస్తారు. దీంతో యూనిట్ వ్యాపారి పెన్షన్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత వ్యాపారి కార్డ్ ప్రింట్ అవుతుంది.
మధ్యలో పథకాన్ని వదులుకుంటే కలిగే ప్రయోజనాలు
ఏ కారణంతో నైనా లబ్ధిదారుడు ఈ పథకం నుంచి 10 ఏళ్ల లోపు నుంచే తప్పుకుంటే..అంతకాలము కట్టిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ ని వెనక్కి ఇస్తారు. అలాగే సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రకారంగా ఇస్తుంది. ఒకవేళ ఐదేళ్ల తర్వాత 60 ఏళ్ల ముందే పథకం నుంచి తప్పుకుంటే చెల్లించిన మొత్తం అమౌంట్ తో పాటు ఈ పథకం ప్రకారం వచ్చే వడ్డీ రేటు గాని సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ గానీ ఈ రెండిటిలో ఏది ఎక్కువ అయితే అవడ్డీని ఇస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు అనుకోని కారణాల వల్ల మధ్యలో చనిపోతే వారి యొక్క నామినీకి రెగ్యులర్గా కాంట్రిబ్యూషన్ చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తారు. ఒకవేళ నామినీకి ఇష్టం లేకుంటే పథకాన్ని రద్దు చేసుకోవచ్చు.