BSNL 5G :తెలుగు రాష్ట్రాల్లో BSNL సరికొత్త ప్రయోగం… జియో, ఎయిర్ టెల్ కు భారీ నష్టం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఆందోళన మొదలైంది. BSNL ట్రయల్ అంటే ఏమిటి?
BSNL 5G : ఇటీవల, Jio మరియు Airtel వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను కొంచెం పెంచిన తర్వాత BSNL పేరు వార్తల్లో ఉంది. ఒకప్పుడు అద్భుతమైన ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ప్రైవేట్ కంపెనీల రాకతో పతనమైంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రైవేట్ కంపెనీల నిర్ణయాలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీనికి తోడు బిఎస్ఎన్ఎల్ కూడా ప్రజలు కోరుకునే విధంగా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది.
BSNL 5G :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే తమ వినియోగదారులకు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ BSNL ఇప్పటికీ దేశంలో పూర్తి స్థాయిలో 4G సేవలను అందించలేకపోయింది. ప్రయివేటు కంపెనీల కంటే చాలా వెనుకబడిన బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూనే, 5జీ సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాదిలో కొత్త ప్రయోగానికి బీఎస్ఎన్ఎల్ శ్రీకారం చుట్టింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలోని BSNL వినియోగదారుల కోసం కొత్త SIM కార్డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా 5G సిద్ధంగా ఉన్న సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అంటే భవిష్యత్తులో 5G అందుబాటులోకి వచ్చినప్పుడు, SIM కార్డ్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా ఈ 5G సిద్ధంగా ఉన్న SIM కార్డ్ అందించబడుతోంది.
ఈ 5G సిద్ధంగా ఉన్న సిమ్ కార్డ్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌లలో ఉపయోగించేందుకు రూపొందించబడింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల మాదిరిగా కాకుండా, 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత BSNL వినియోగదారులు సిమ్ కార్డ్‌ని మార్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, కేరళలో ప్రయోగాత్మకంగా ఈ 5జీ సిమ్ కార్డులు అందుబాటులో ఉన్నాయని… త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.
BSNL ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5G సేవలను ప్రారంభించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా BSNL 5G సేవలను పరిశీలించారు. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మంత్రి సింథియా వీడియో కాల్ చేశారు.