నిరుద్యోగులరా బీ రెడీ.. 9,995 బ్యాంక్ కొలువులు..!

నిరుద్యోగులరా బీ రెడీ.. 9,995 బ్యాంక్ కొలువులు..!

ఏళ్లు తరబడి చదువుతున్న నిరుద్యోగులకు ఈ వార్త గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవీటివల రిలీజ్ చేసింది. ప్రాంతీయ రూరల్ బ్యాంకుల్లో దాదాపు పది వేల పోస్టులకు జూన్ 7న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్), స్టాఫ్ ఆఫీసర్స్ (స్కేల్-I, II, III) పోస్టులను భర్తీ చేయనుంది. కాగా, బ్యాంకు ఉద్యోగాలకు గత కొన్నిరోజులుగా ప్రిపేర్ అయ్యేవారు ఈ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పోస్టుల భర్తీ ద్వారా డ్రైవ్ ద్వారా ఐబీపీఎస్ 5,585 మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మొత్తం 9,995 ఖాళీలను భర్తీ చేయనుంది. IBPS RRB 2024 కోసం అప్లై చేయడానికి గడువు తేదీ జూన్ 27 గా నిర్ణయించారు. ఈ పోస్టులకి అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ibps.in విజిట్ చేసి ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవచ్చు.

అర్హత

ఏ ప్రాంతంలో అయినా ఉన్న యూనివర్సిటీ లో కనీసం డిగ్రీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే, స్థానిక భాషలో
బ్యాంక్ కి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడటం అభ్యర్థికి తెలిసి ఉండాలి. కనీస కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, PwD వర్గాల అభ్యర్థులు రూ. 175 పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి జూన్ 27 వరకు, ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవడానికి జులై 12 వరకు గడువు ఉంది.

దరఖాస్తు చేసుకునే విధానం

1. ముందు మీరు IBPS అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో కనిపించే ‘IBPS RRB రిక్రూట్‌మెంట్ 2024’ అనే లింక్ పై క్లిక్ చేయండి.
3. మీరు కొత్త యూజర్ అయితే..అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
4.కాగా, ఇప్పటికే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు..తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
5. లాగిన్ అయిన తర్వాత..అప్లికేషన్ ఫారమ్ నింపండి. అనంతరం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. అన్ని వివరాలను క్రాస్-చెక్ చేసి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

ఎగ్జామ్ షెడ్యూల్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్- IBPS..ప్రతి ఏటా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో IBPS RRB క్లర్క్ ఎగ్జామ్ రెండు దశల్లో జరుగుతుంది. ముందు ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత..మెయిన్ ఎగ్జామ్ రాయాలి. IBPS క్యాలెండర్ 2024 ప్రకారం.. ఈ పోస్టుల ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ సంవత్సరం ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో జరగనుంది. మెయిన్ ఎగ్జామ్ మాత్రం అక్టోబర్ 6న జరగనుంది. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) జులై 22 నుండి 27 వరకు జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన డౌట్స్ ఉన్న,అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ రిఫర్ చేయడం చాలా మంచిది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now