ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా వచ్చినపుడు, ఎవరైనా అనూహ్య పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు, చాలా మంది బ్యాంకుల సాయం పొందుతూ Personal Loans తీసుకుంటారు. అయితే, బ్యాంకులు విభిన్నంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఈ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతుంటాయి.
తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంక్‌ను ఎంచుకుని, అక్కడ నుండి Personal Loans తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి నెలనూ EMI (ఎక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్మెంట్) కట్టాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా లేదా ఇతర అనుకోని సమస్యల వలన EMI చెల్లించడం కష్టమవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏమి జరగవచ్చు? ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చు? అనేవి ఇక్కడ తెలుసుకుందాం. మీరు బ్యాంక్ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థల నుండి Loans తీసుకున్నప్పుడు, మీరు తీసుకున్న మొత్తం చెల్లించడానికి EMI రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి నెల కూడా EMI కట్టడం తప్పనిసరి. EMI సకాలంలో చెల్లించడం వలన రుణాన్ని పూర్తిగా తీర్చడమే కాకుండా, మీ సిబిల్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. కానీ, మీరు EMI చెల్లించడంలో విఫలమైతే, కొన్నివేళ సమస్యలు తలెత్తవచ్చు. అయినా, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చట్టపరమైన రక్షణలు మీకు అందుబాటులో ఉన్నాయి.
మీరు EMI చెల్లించడంలో విఫలమైతే, అది జైలుకు వెళ్లాల్సినంత పెద్ద నేరం కాదు. చెక్ బౌన్స్ లాంటి సందర్భాలలో మాత్రం జైలు శిక్ష పడవచ్చు. అయితే, బ్యాంక్ Loans విషయంలో అలా జరగదు. మీ ఆస్తులను వేలం వేస్తారనే భయపడాల్సిన అవసరం లేదు.
చట్టం ఏం చెబుతోంది అంటే, ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం, EMI చెల్లించలేని వ్యక్తిని కాల్ చేసి బెదిరించకూడదని స్పష్టం చేస్తోంది. మీరు వరుసగా రెండు లేదా మూడు EMIలు చెల్లించకపోతే, బ్యాంక్ నోటీస్ జారీ చేస్తుంది.
ఈ నోటీసులో మీ పరిస్థితులను వివరించమని కోరతారు. అప్పులు వసూలు చేసేవారు కస్టమర్లను భయపెట్టకూడదు, మర్యాదగా ప్రవర్తించాలి. మీరు చెల్లించలేకపోతే, మీ ఆస్తిని వేలం వేస్తారనే పరిస్థితి వస్తే, ముందుగా మీ అంగీకారాన్ని తీసుకుంటారు.
మీరు Loans EMI చెల్లించడంలో కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, మీరు బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి, Loans కాలపరిమితిని పొడిగించమని లేదా మరేదైనా పరిష్కారం కోసం కోరవచ్చు. చాలాసార్లు బ్యాంకులు మీ సమస్యను అర్థం చేసుకుని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ నియమాలను పరిగణనలోకి తీసుకుని, బ్యాంక్ లోన్ తీసుకోవడం ముందే ఆలోచించండి.