తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్..ఇక కొత్త రేషన్ కార్డులు..
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దీనికి ముఖ్య కారణం..ఎన్నిక సమయంలో 6 గ్యారంటీల హామీ ఇవ్వడం మాత్రమే. ఇప్పుడు ఇదిగో అంటూ ఏ గ్యారంటీని అమలు చేయలేక పోతుంది. కేవలం ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు మాత్రమే అమలు చేస్తుంది. కాగా, ఇప్పటికీ 6 గ్యారంటీలో కొన్ని హామీలు నెరవేరలేదు. తాజాగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తామని ఇప్పటికి ప్రభుత్వం చెప్పింది. రేషన్ కార్డుల ఆధారంగానే మిగతా పథకాలు అమలు చేస్తామని కూడా చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అనేకంగా నాకిలి ఉన్నావని ప్రభుత్వ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఇన్ని రోజులు దేశంలో ఎన్నికలు సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నది. అందుకే కొత్త రేషన్ కార్డు జారీ చేయలేకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, జూన్ 6న ఎన్నికల కోడ్ ముగిసిపోయింది. అయినా కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మీద ఎలాంటి కసరత్తు చేయకపోవడం ప్రజల్లో త్రీవ నిరాశానికి దారితీస్తోంది.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో 89.98 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రజా పాలన దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కొరకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే స్క్రూటీ చేశామని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చు. కానీ, ఇప్పటికీ కొత్త రేషన్ కార్డుల పై ఎలాంటి కసరత్తు చేయలేక పోతుంది. దీంతో రేషన్ కార్డు లేని ప్రజలు త్రీవ ఇబ్బందికి గురవుతున్నారు.
చాలా లోతుగా ఆలోచిస్తే..కొత్త రేషన్ కాల ప్రక్రియ చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఇలాంటి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. దీంతో గతంలో జరిగిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు కనుక కొత్త రేషన్ల కార్డుల జారీ చేస్తే లబ్ధిదారులు త్రీవంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ అన్ని పథకాలు రేషన్ కార్డుల ద్వారా అమలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో ఆలస్యం చేస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కేవలం 500 కే సిలిండర్ అమలు చేసిన..కొత్త రేషన్ కార్డు ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే…కొత్త రేషన్ కార్డుల వల్లే అనేక పథకాలు అమలు కానున్నాయి. రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల వల్ల ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..తెల్ల రేషన్ కార్డు వారికి సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అమలు కాలేదు. దీంతో ప్రజలు నిరాశతో ఉన్నారు. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డులకు ప్రజలు కళ్ళు చెదిరేలా ఎదురుచూస్తున్నారు.