PM కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండిలా..!!
కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ..రైతుల అభివృద్ధి కోసం అదేవిధంగా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రసిద్ధమైనది ఒకటి ప్రధానమంత్రి కిసాన్ యోజన. దీనిలో ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి ఏటా అకౌంట్లో రూ.6,000 జమ చేస్తుంది. ఒక్కో విడతలో ఖాతాలోకి రూ.2,000 వచ్చే చోట ఈ డబ్బు విడతల వారీగా లభిస్తుంది. ఈ పథకం యొక్క లబ్దిదారులు కిసాన్ క్రెడిట్ పథకం యొక్క ప్రయోజనం కూడా పొందుతారు. ఈ పథకం గురుంచి పూర్తిగా ఈ వార్త ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా మీరు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం.
కిసాన్ క్రెడిట్ స్కీమ్ అంటే ఏమిటి?
ఎవరైనా రైతు చేపల పెంపకం, పశుపోషణ లేదా వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే..అతను కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రుణం తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన స్వల్పకాలిక రుణం అని చెప్పొచ్చు. దీనిలో రైతులకు చౌక వడ్డీ రేట్లకు రుణ సౌకర్యం ఇవ్వబడుతుంది. ఈ రుణం 2% నుండి 4% వరకు వడ్డీ రేట్ల వద్ద ఇవ్వబడుతుంది.
ఈ రుణం చెల్లించేందుకు రైతులకు చాలా సమయం ఇస్తున్నారు. ఇది తక్కువ వడ్డీ రేటు, బీమా కవరేజ్ మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కాకుండా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్, సేవింగ్స్ ఖాతా మరియు డెబిట్ కార్డ్ సౌకర్యం కూడా లభిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
1. ముందుగా మీరు మీ దగ్గరలోని బ్యాంకు శాఖకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
2. అక్కడికి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు ఫారమ్ కోసం అడగండి.
3. ఫారమ్‌తో పాటు..మీరు చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఐడి ప్రూఫ్ వంటి పత్రాలను జతచేయాలి.
4. ఫారమ్ నింపిన తర్వాత..దానిని బ్యాంకుకు సమర్పించండి.
5. మీ ఫారమ్ ధృవీకరించబడుతుంది. అధేవిధంగా చివరకు మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందుతారు.