మహిళల పేరు మీద ఆస్తిని కొంటె ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. ?

మహిళల పేరు మీద ఆస్తిని కొంటె ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. ? 

నేటి కాలంలో, మహిళలు అన్ని రంగాలలో తమ సత్తాను చాటుతున్నారు. పురుషుల కంటే మహిళలు వెనుకబడిన రంగమేదీ లేదు. అయినప్పటికీ, మహిళలు మరియు బాలికల సాధికారత కోసం ప్రభుత్వం తన పథకాల క్రింద అనేక ప్రయత్నాలు చేస్తుంది. మహిళలను స్వావలంబన, సమర్థులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్తభూతం, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించింది. మహిళలు తమ పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే..వారు పురుషుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వారికి పన్ను మినహాయింపుతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆడపిల్లలు మరియు మహిళల పేరుతో ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల కలిగే నాలుగు పెద్ద ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

1. వడ్డీ రేటు

మహిళలు తమ పేరు మీద ఒకవేళ ఇల్లు కొంటే..బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పుడు పురుషుల కంటే తక్కువ వడ్డీకే చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో ప్రతి నెల చెల్లించాల్సిన EMI కూడా తక్కువగా ఉంటుంది.

2. రుణ ఆమోదం

స్త్రీలు తమ పేరు మీద ఇల్లు లేదా ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణం తీసుకుంటే..పురుషుల కంటే వారికి త్వరగా రుణం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా మహిళలు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు బంగారు నాణేలు, హాలిడే కూపన్లు, పలు రకాల బహుమతులు కూడా అందజేస్తారు.

3. ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత..దానిని నమోదు చేయాలి. పురుషులు కాకుండా..మహిళలు తమ మీద ఆస్తిని నమోదు చేసుకుంటే.. వారికి ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పురుషుల కంటే చాలా తక్కువ ఉంటుంది. ఢిల్లీలో ఒక మహిళ తన పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే.. ఆమె ప్రభుత్వ ఆస్తికి 2% తక్కువ చెల్లించాలి. ఉదాహరణకు, ఢిల్లీలో ఒక మహిళ తన పేరు మీద కోటి రూపాయల ఆస్తిని కొనుగోలు చేస్తే.. ఆమె కనీసం రూ. 2 లక్షలు చెల్లించాలి.

4. ప్రభుత్వ పథకం

ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మహిళలు ఇళ్లు మరియు ఆస్తిని కొనుగోలు చేస్తే, వారు తక్కువ వడ్డీ రేట్లు చెల్లించాలి

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now