త్వరలోనే న్యూ లుక్ లో రేషన్ కార్డులు..మార్పులు ఎలావుంటాయంటే..?

త్వరలోనే న్యూ లుక్ లో రేషన్ కార్డులు..మార్పులు ఎలావుంటాయంటే..?

రానున్న రోజుల్లో తెలంగాణ రేషన్ కార్డులు సరికొత్త రూపంలో ప్రజల ముందుకు వస్తాయి. ఈమేరకు మార్పులతో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నిలక కోడ్ ఉనందున్న వీటి ప్రక్రియపై ద్రుష్టి పెట్టలేదు. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన కసత్తు మొదలు కానున్నదని సమాచారం. అయితే, ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా చికిత్స పరిమితి రూ.5 లక్షలు మాత్రమే ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో రూ.10 లక్షల చికిత్స అనే అంశాన్ని హైలైట్ చేసేలా కొత్త రేషన్ కార్డుల డిజైన్‌ను రెడీ చేయించారు. పాత ఆరోగ్యశ్రీ కార్డుల(Ration Cards) స్థానంలో ఈ కొత్త డిజైన్‌తో కూడిన కొత్త వాటిని పంపిణీ చేయనున్నారు.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో 89,98,546 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో రేషన్‌ కార్డు ఓ చిన్న బుక్‌ మాదిరిలా ఉండేది. దానిలో కుటుంబ యజమాని ఫొటోతో పాటు..కుటుంబ సభ్యుల పేర్లు, వయసు మిగతా వివరాలు ఉండేవి. తర్వాతి.. కాలంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతుబంధు పాస్‌ పుస్తకం సైజులో కొత్త రేషన్‌కార్డులను ఇచ్చారు. వీటిలో ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, దాని కింది భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు అనగా పేర్లు వయసు ఉండేవి. కార్డు వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. దీని తర్వాత..రేషన్ కార్డుల్లో ఒక పేజీతో ఒకవైపే అన్ని వివరాలను పొందుపరిచారు. ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటోలు ఉండేవి కావు. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు జారీచేయనున్న కొత్త రేషన్ కార్డు ఎలా ఉంటుంది ? అంటే.. పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త రూపంలో ఉంటుందని చెబుతున్నారు కొందరు. ఈ కొత్త రేషన్ కార్డుల పై ఎన్నికల కోడ్‌ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కొన్ని నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. రేషన్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో..ప్రతీ నిర్ణయంలోనూ ఆచితూచి
తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటంపై అప్పట్లో ప్రజాగ్రహం వ్యక్తమైంది. దీన్ని గుర్తించిన ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కొత్త కార్డుల జారీకి నిర్ణయించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment