ఇంట్లో కూర్చొనే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.5 లక్షల లోన్..అదేలాంటే..?

ఇంట్లో కూర్చొనే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.5 లక్షల లోన్..అదేలాంటే..?

మీరు ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ వాడుతున్నారా?..అయితే ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటని అనుకుంటున్నారా?.. మీరు చాలా సులభంగానే రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా?..అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు ఈ వార్త ద్వారా తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ లోన్స్ కూడా అందిస్తోంది. అయితే నేరుగా ఇవ్వదు. ఇతర ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో పాటు రుణాలు ఆఫర్ చేస్తోంది. అందువల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. లేదంటే డబ్బులు అవసరం పడ్డా.. సులభంగానే ఫ్లిప్‌కార్ట్ యాప్ నుంచే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా లోన్ పొందాలి? ఎంత లోన్ వస్తుంది? వంటి అంశాలను ఒకసారి తెలుసుకుందాం.

ప్రపంచంలో ప్రముఖ ఈకామర్స సంస్థల్లో ఒకటిగా రాణిస్తూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్..ఇప్పుడు పర్సనల్ లోన్స్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు లోన్ మేళా నిర్వహిస్తోంది. మే 21 వరకు లోన్ మేళా అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా తెలుస్తోంది. మీరు లోన్ పొందాలనుకుంటే..లోన్ మేళా ఆప్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత ఇప్పుడు మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పలు వివరాలు తెలుసుకోవచ్చు. లోన్ టెన్యూర్ 6 నెలల నుంచి 72 నెలల వరకు పెట్టుకోవచ్చు. అంతా డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంతే ఫిజికల్‌గా పేపర్లు సమర్పించాల్సిన పని లేదు.

తర్వాత తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్ పొందొచ్చు. వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే, కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్, లోన్ మొత్తం వంటి వాటి ద్వారా వడ్డీ రేటులో మార్పు ఉండొచ్చు అని చెప్పవచ్చు. అంటే కొంత మందికి ఎక్కువ వడ్డీ రేటు పడొచ్చు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పుడు మీ పాన్ కార్డు నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది. తర్వాత నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అడ్రస్ వివరాలు, కంపెనీ వివరాలు పొందుపరచాలి. దీంతో మీకు అప్రూవల్ ఉందా? లేదా? అనే విషయం వెంటనే తెలుస్తుంది.

తర్వాత..మీకు రుణ అర్హత వస్తే ఎంత మొత్తం రుణం లభిస్తుందో తెలుస్తుంది. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ వివరాలు కూడా అవసరం అవుతాయి. ఇలా మీరు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన లోన్ టెన్యూర్ ఎంచుకోవచ్చు. అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు చాల సింపుల్ గా ఇంట్లో నుంచే ఫ్లిప్‌కార్ ద్వారా లోన్ పొందొచ్చు. అయితే, అర్హత ఉన్న వారకే రుణాలు సులభంగా లభిస్తాయి. లేని వారికి రుణ పొందటం సాధ్యం కాదు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment