ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ చెక్ చేసుకోవాలా?.. ప్రాసెస్ ఇదే..!!
రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒకటైన PM కిసాన్ యోజన. భారతదేశంలో PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్న చాలా మంది రైతులు 17వ విడత కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పంట పండించే రైతులకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు తమ అకౌంట్లో జమ చేస్తుండగా..ప్రతి 4 నెలలకు ఒకసారి విడతల వారీగా రైతులకు ఈ డబ్బులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు PM కిసాన్ స్టేటస్ ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. స్టేటస్ ని తనిఖీ చేయడానికి సులభమైన మార్గాన్ని ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
1. మీరు PM కిసాన్ కోసం నమోదు చేసుకున్నట్లయితే..ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లండి.
2. తర్వాత ఫార్మర్స్ కార్నర్‌లో ‘నో యువర్ స్టేటస్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ తెరిచిన తర్వాత..మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు క్యాప్చా నమోదు చేస్తూ కొనసాగండి.
4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.అప్పుడు దాన్ని నమోదు చేయండి.
5. ఈ విధంగా రిజిస్ట్రేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన ఎవరి కోసం?
క్రింద ఇవ్వబడిన షరతుల ప్రకారం..రైతులు తప్పనిసరిగా PM కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులు .
1. భూమి ఉన్న రైతులందరూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అర్హులు.
2. మునుపటి అసెస్‌మెంట్ సంవత్సరంలో రైతు లేదా అతని కుటుంబంలోని ఎవరైనా పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు.
3. కేవలం వ్యవసాయ భూమిని వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి.
4. దరఖాస్తుదారు సన్నకారు మరియు చిన్న రైతుల కేటగిరీలో ఉండాలి.
5. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే..దానికి సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేయబడింది. 155261/011-24300606కు కాల్ చేయడం ద్వారా ప్రజలు తమ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు.