కళ్ళు చెదిరే ఆఫర్..రూ.76 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.13 వేలు మాత్రమే..!

కళ్ళు చెదిరే ఆఫర్..రూ.76 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.13 వేలు మాత్రమే..!

తక్కువ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇ-కామర్స్ కంపెనీలు ఇలాంటి డివైజ్‌లపై మంచి ఆఫర్లు ప్రకటించాయి. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రిలీజ్ అయినా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ 8’ ధర భారీగా తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్‌పై ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. లాంచ్ ధరతో పోలిస్తే దీన్ని దాదాపు 60 శాతం డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. పిక్సెల్ 8పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న డీల్స్ అదేవిధంగా డిస్కౌంట్ చెక్ చేద్దాం.

గూగుల్ ఫ్లాగ్‌షిప్ ‘గూగుల్ పిక్సెల్ 8’ స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో  రూ.75,999 ధరతో మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది. కస్టమర్లు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8 ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ.75,999కే లిస్ట్ అయింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ 17% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ. 62,999కు లభిస్తోంది.

ఒకవేళ మీ దగ్గర గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ ఉంటే..దాన్ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే దాదాపు రూ.25,700 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక  కస్టమర్లుకు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ ఉంటె దానిపై కొనుగోలు చేస్తే..అదనంగా రూ.7,500 వరకు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ రెండు ఆఫర్లను కలిపితే పిక్సెల్ 8 ఫోన్‌ను కేవలం రూ. 29,799కే సొంతం చేసుకోవచ్చు. మింట్ కలర్ వేరియంట్‌లో వచ్చిన 8GB RAM+128GB స్టోరేజ్‌ మోడల్‌పై మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్స్ అందిస్తోంది. అంతేకాకుండా కొత్త ఫోన్లపై అయితే రూ.63 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. అంటే రూ.13 వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లో 6.20 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1080 x 2400 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నానో-కోర్ గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. పిక్సెల్ 8 సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో రన్ అవుతుంది. ఇది సరికొత్త ఫీచర్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4575 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ప్రొప్రైటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు.

ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అద్భుతమైన ఫొటోస్ తీయడానికి 50MP ప్రైమరీ కెమెరా, ఆటో ఫోకస్ సామర్థ్యంతో 12MP కెమెరా వస్తుంది. సెల్ఫీల కోసం దిగడానికి ఫోన్ ముందు భాగంలో 11MP ఫ్రంట్ కెమెరాను అందించారు. Pixel 8 స్మార్ట్ ‌ఫోన్ 150.50mm ఎత్తు, 70.80 mm వెడల్పు, 8.90mm మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ Wi-Fi 802.11 a/b/g/n/ac/ax, GPS, USB టైప్-C సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. రెండు సిమ్ కార్డ్‌లకు యాక్టివ్ 4G సపోర్ట్ ఉంటుంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అనేక రకాల సెన్సార్స్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment