ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్..రూ.1,000కే కొత్త 5జీ ఫోన్..ఇప్పుడే త్వరపడండి..!!
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ న్యూస్ భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటని అనుకుంటున్నారా?..అయితే మీరు ఈ ఆఫర్ గురించి పక్క తెలుసుకోవాల్సిందే. ఒకవేళ మీ వద్ద పాత ఫోన్ ఉంటే చాలు..కేవలం రూ.1000 బడ్జెట్లోనే కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అది కూడా 5జీ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా?..అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. పలు రకాల డిస్కౌంట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ ఏ ఆఫర్లు ఉన్నాయో.. ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. 5జీ ఫోన్‌పై కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన టీ3ఎక్స్ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 17,499. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 13,499కే కొనొచ్చు. అంటే మీకు నేరుగానే 22 శాతం డిస్కౌంట్ వస్తోంది. అలాగే ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. ఏకంగా రూ. 12,950 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే, ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ ఆధారంగా ఉంటుంది. కొన్ని ఫోన్లకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ వివో ఫోన్‌పై మరో ఆఫర్ కూడా పొందొచ్చు. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే..అప్పుడు మీకు రూ. 1000 వరకు అదనపు తగ్గింపు వస్తుంది. దీంతో మీరు ఇంకా తక్కువకే ఈ ఫోన్‌ను కొన్నోచు. అందువల్ల ఈ ఫోన్‌పై పలు ఆకర్షణీయ డీల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఉంది.కెమెరా గురుంచి మాట్లాడితే..50 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 6.72 ఇంచుల డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు చాలా ఉన్నాయి. ఇక ఇది 5జీ ఫోన్. అందువల్ల మీరు మెరుగైన నెట్వర్క్ పొందొచ్చు. ఫాస్ట్ డౌన్ లోడింగ్స్ ఉంటాయి. అలాగే ఈ ఫోన్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ. 650 కడితే సరిపోతుంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 843 పడుతుంది. ఇక ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ.1200 కట్టాలి.