ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..రూ.50లక్షల వరకూ సులభంగా లోన్..!!

ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..రూ.50లక్షల వరకూ సులభంగా లోన్..!!

సొంత ఇంటిని కట్టుకునాలనే  ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుగా హోమ్ లోన్ల గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటారు. ఇదే సురక్షితమైన, లాభదాయకమైన మార్గం కూడా అని చెప్పవచ్చు. అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేటును తగిన లాన్ కు వసూలు చేయవు. వాటి నిబంధనల ప్రకారం మారుతూ ఉంటాయి. అయితే ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర కారణాలతో పల్లెటూర్ల నుంచి పట్టణాలకు ప్రజల వలసలు ఎక్కువయ్యాయి. దీంతో చాలా మంది తమ సొంతూళ్లను వదిలి నగరాల బాట పడుతున్నారు. మంచి ఉద్యోగం, లాభదాయకమైన వ్యాపారం, నాణ్యత కలిగిన చదువుల కోసం ఈ మార్పు తప్పడం లేదు. ఇలా నగరాలకు వెళ్లిన వారి మొదటి ప్రాధాన్యం సొంతిల్లు కట్టుకోవడమే. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతుంటారు.

సొంతింటికి ప్రాధాన్యం

సొంతిల్లు అనేది మన ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే యువకులకు ఉద్యోగం తర్వాత ప్రధాన అర్హతగా సొంతింటిని చూస్తున్నారు జనాలు. సరైన ఉద్యోగం, సక్రమమైన ఆదాయం కలిగి ఉంటే సొంతింటిని సమకూర్చుకోవడం సులభమేనని చాలా మంది నమ్మకం. ఇల్లు కట్టాలనుకునే వారికీ వివిధ బ్యాంకులు అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ప్రతినెలా ఈఎమ్ఐలు చెల్లించేలా రుణాలు ఇస్తున్నాయి.

బెస్ట్ బ్యాంకులు ఇవే

నగరాలలో సొంత ఫ్లాట్ లేదా ఇల్లు సమకూర్చుకోవాలంటే దాదాపు రూ.50 లక్షలు అవసరం. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల లోపు హోమ్ లోన్లు అందించే ఏడు ప్రధాన బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో అవి వసూలు చేస్తున్న వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులనూ పరిశీలిద్దాం.

1. బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఇల్లు కట్టుకునాలనే వారికీ హోమ్ లోన్లను మంజూరు చేస్తుంది. దాదాపు రూ.50 లక్షల వరకూ లోన్ అందిస్తోంది. ఆ రుణాలపై 8.30 శాతం వడ్డీ విధించింది.

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా హోమ్ లోన్లు తీసుకునే అవకాశం వచ్చింది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు దాదాపు 8.35 శాతంగా ఉంది.

3. హోమ్ లోన్లపై బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర లో 8.35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు అమలవుతోంది.

4. సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లు మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.35 శాతం వడ్డీరేటు విధించింది. అలాగే జీఎస్టీ తో పాటు 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది.

5. కెనరా బ్యాంకులో హోమ్ లోన్లు తీసుకునే వీలు ఉంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.40 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీనికి అదనంగా 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

6. సొంతిల్లు కోసం ఐడీబీఐ బ్యాంకు రూ.50 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీరేటు 8.40 శాతంగా ఉంది.

7. హెచ్ఎస్ బీసీ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుంటే  దాదాపు 8.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అయితే, ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment