భార్యభర్తలు రోజుకు రూ.14 ఆదా చేస్తే చాలు..ఏటా చేతికి రూ.120000
నిత్యా జీవితంలో అవసరాలు బాగా ఉంటాయి. కొన్ని అవసరాలు జీవితాంతం వస్తుంటే మరికొన్ని వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఏదో పని చేసి సంపాదిస్తున్నంత కాలం అవసరాలు తీరుతాయి. మరి రిటైర్మెంట్ తర్వాత ఎలా? వృద్ధాప్యంలో కూడా ఆర్థిక అవసరాలకు ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు రిటైర్మెంట్ ఫండ్ ఉపయోగపడుతుంది. సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచే కొంత మొత్తం రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తే..వయసులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రిటైర్మెంట్ ఫండ్ కోసం ప్రజలకు అనేక పథకాలు అందిస్తున్నాయి.
అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునే స్కీమ్‌లో ప్రతినెలా కేవలం రూ.210 (అంటే రోజుకు రూ.7 రూపాయలు) మాత్రమే ఇన్వెస్ట్ చేసి సంవత్సరంలో రూ.60,000 రిటర్న్స్ అందుకునే వీలు ఉంటుంది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం. ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఇప్పుడు ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
అటల్ పెన్షన్ యోజన పథకం ప్రత్యేకతలు:
కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని యువకులు, మహిళలు, రైతులు, వృద్ధుల కోసం ఈ స్కీమ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు అని చెప్పవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు 60 ఏళ్ల వయస్సు నుంచి జీవితాంతం పెన్షన్ పొందొచ్చు.
ప్రతి నెలా ఎంత పెన్షన్ అందుతుంది?
అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా నెలవారీ పెన్షన్లు రూ.1000 నుంచి రూ.5,000 వరకు అందజేస్తున్నారు. మీరు రిటైడ్ అయినప్పుడు..ప్రతి నెలా రూ.1000 పెన్షన్ పొందాలనుకుంటే..కేవలం రూ.42 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ వ్యవస్థ. కాగా, ఇది భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది.
ఈ పింఛను వల్ల 60 ఏళ్లు వచ్చేసరికి ప్రతి నెలా రూ.5,000 అనుకుంటే..ఏడాదికి ఎక్కువగా దాదాపు రూ.60,000 వరకు పెన్షన్ లభిస్తుంది. అంటే రోజుకు రూ. 7 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. అదే భార్యభర్తలిద్దరూ రూ.14 ఆదా చేస్తే ఏటా రూ. 1,20,000 వరకు పెన్షన్ లభిస్తుంది. అంటే నెలకు రూ. 10000 పెన్షన్ మీకు అందుతుంది.
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్:
ఒకవేళ మీరు 18 సంవత్సరాల వయస్సులో రూ.42 పెట్టుబడి పెడితే..ప్రతినెలా రూ.1,000 వరకు పెన్షన్ లభిస్తుంది. అదే విధంగా రూ.84 ఇన్వెస్ట్ చేస్తే..నెలవారీ పెన్షన్ రూ.2,000, రూ.210తో రూ.5,000 వరకు నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు. అయితే, పెన్షన్ అమౌంట్ మీ వయస్సుపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి. 40 ఏళ్ల వయస్సులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే..రూ.5,000 పెన్షన్ పొందేందుకు మీరు నెలకు రూ.1,454 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే అంత మేలు.
అటల్ పెన్షన్ యోజన వయో పరిమితి:
అటల్ పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 40 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకునే వీలుండదు. దరఖాస్తుదారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ని ఉపయోగించి ఎన్రోల్ చేయడం ద్వారా మీరు మొత్తం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ అందుకుంటారు.
అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు:
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ దాదాపు మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నడిపిస్తుంది. కావున కార్పస్ సురక్షితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎవరైనా 30 సంవత్సరాల వయస్సులో ఈ కార్యక్రమంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 60 ఏళ్లలోపు మరణిస్తే..వారి పెన్షన్ వారి జీవిత భాగస్వామికి అందుతుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే వారి ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బు నామినీకి అందుతుంది.